1.ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏదీ శాశ్వతం కాదని, కాలం చాలా శక్తివంతమైందని ఎప్పటికీ అధికారంలో ఉంటారని ఎవరైనా అనుకుంటే అది జరిగే పని కాదని ఆయన కామెంట్ చేశారు
2.బండి సంజయ్ కామెంట్స్
కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
3.టీమిండియా ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్టీఆర్

న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడడానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్ లు కొంతమందిని జూనియర్ ఎన్టీఆర్ కలిసారు.
4.బీఆర్ఎస్ సభపై హరీష్ రావు కామెంట్స్
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మకమైన సభ నిర్వహించబోతున్నారని బిఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు.
5.అన్నదాతలకు అండగా ఉంటాం
రైతుల కష్టాలు కన్నీళ్ళ గురించి తమ పార్టీకి ఎక్కువ అవగాహన ఉందని, అధికారంలోకి వస్తే అన్నదాతలకు పూర్తిగా అండగా ఉంటామని జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.
6.చంద్రబాబు నియోజకవర్గ సమీక్షలు
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేటి నుంచి నియోజకవర్గల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు.
7.మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో…

మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి.మలేషియా కౌలంపూర్ లోని డి చక్ర గ్రూప్ టాప్ హాల్ టి ఎల్ కే కాంప్లెక్స్ బ్రేక్ ఫీల్స్ కొరలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సంపదాయాలు ఉట్టి పడేవిధంగా ప్రవాసులు తరలివచ్చారు.
8.దేశంలో నేడు 320 ఇళ్ళ రద్దు
వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణంగా 320 రైళ్ళను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
9. టిఆర్ఎస్ ఖమ్మం సభకు బిజెపి ఎమ్మెల్యే ప్రశ్న
టిఆర్ఎస్ ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
10.పవన్ కళ్యాణ్ గోపూజ

పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ నిర్వహించారు.
11.ఆలీ సంచలన ప్రకటన
సినీ నటుడు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ సంచలన ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
12.గద్దర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో నూతన నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని గద్దర్ అన్నారు.
13.టిడిపి ఎంపీ కేశినేని నాని కామెంట్స్

నీతి నిజాయితీ క్యారెక్టర్ ఉన్న వాళ్లకే టిడిపి టికెట్లు ఇవ్వాలని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
14.ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కామెంట్స్
ఏపీ హక్కుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ,ఆయన ఆంధ్ర పాలకుల దోపిడిని ప్రశ్నించారని ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
15.విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
విశాఖపట్నం జిల్లాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.అయితే డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది.
16.ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఖమ్మంలో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో భారీగా జనాలు హాజరు కాబోతూ ఉండడంతో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
17 నేడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం
నేడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం జరగనుంది.ఉద్యమం ఉదృతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
18.నేటితో ముగియనున్న బిజెపి సమావేశాలు
నేటితో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి.
19.జల్లికట్టు వేడుకలు

తిరుపతి జిల్లాలోని మల్లయ్య పల్లి , డోర్నకంబాల, మఠం పల్లెలలో జల్లికట్టు వేడుకలు జరగనున్నాయి.
20.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్యటన
నేడు బాపట్ల జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పర్యటిస్తున్నారు.







