హైదరాబాద్ లోని తార్నాకలో కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.రామకృష్ణా కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో నలుగురు విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే.
ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.మృతుడు ప్రతాప్ కుటుంబ సభ్యులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
కరెంటు వైరుతో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్తె ఆధ్య, తల్లిని ప్రతాప్ హత్య చేసాడు.అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్యామిలీ మార్చాలన్న విషయంలో ప్రతాప్ కు, ఆయన భార్య సింధూరకు గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ కారణంగానే హత్యలు జరిగాయని తెలుస్తోంది.







