యాక్టీవ్ అయిన ' తుమ్మల ' ! హరీష్ ఏం మంత్రమేశారో ? 

మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్లుగా తయారైంది ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం.ఆయన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నా,  తీవ్ర అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు.

 Active 'thummala'! What Did Harish Spell, Tummala Nageswarao, Brs Party, Trs, Kc-TeluguStop.com

తన సీనియారిటీ, సిన్సియారిటీకి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదనతో తుమ్మల ఉంటూ వస్తున్నారు.అప్పుడప్పుడు తన అనుచరులతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తూ ఉండేవారు.

ఈ క్రమంలోనే ఆయన బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Telugu Brs, Hareesh Rao, Kandalaupendar-Political

 ఇక ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరికకు సర్వం సిద్ధమైంది.దీంతో తుమ్మల కూడా పొంగులేటి వెంటే బిజెపిలో చేరుతారని, బిజెపి నుంచి ఈ మేరకు తుమ్మలకు గట్టి హామీలే లభించినట్లు ప్రచారం జరిగింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు గాను, కమ్మ సామాజిక వర్గంలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ‘తుమ్మల’ పార్టీ మారితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని,  ఇప్పటికే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా ఉందని గుర్తించిన ఆ పార్టీ అధిష్టానం తుమ్మలను బుజ్జగించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన మంత్రి హరీష్ రావుకు అప్పగించింది.

రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
   దాదాపు 5 లక్షల మందితో ఈ.

ఈ సభను నిర్వహించి సక్సెస్ చేయాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.ఈ సభ నిర్వహణ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు.

దీంతో గత కొద్ది రోజులుగా ఖమ్మంలో ఎక్కువగా పర్యటిస్తున్న హరీష్ ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు తో ఆయన నివాసంలోనే సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తుమ్మల అసంతృప్తికి గల కారణాలను హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు.

తుమ్మలకు స్పష్టమైన హామీని ఇవ్వడంతో పాటు,  రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ హామీను కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు.

ఆయన బీఆర్ఎస్ లో చేరిన సమయంలోనే టికెట్ హామీని ఇచ్చారు.
 

Telugu Brs, Hareesh Rao, Kandalaupendar-Political

 అయితే ఇప్పుడు అదే హామీని తుమ్మల నాగేశ్వరరావుకు హరీష్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అంతేకాకుండా పార్టీ తరఫున కీలక పదవిని,  ప్రాధాన్యాన్ని ఇస్తామని హరీష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారట.హరీష్ హామీ తర్వాత తుమ్మల నాగేశ్వరావు బాగా యాక్టివ్ అయ్యారు.

బీర్ఎస్ తరఫున ప్రకటనలు చేస్తున్నారు.అంతేకాదు కేసీఆర్ పైన ప్రశంసలు కురిపిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉండడంతో,  ఇప్పటివరకు బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి ఉన్న తుమ్మల ఇప్పుడు బాగా యాక్టిివ్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube