టైం కి షూటింగ్ కి రాని రాజశేఖర్ కి గట్టి జలక్ ఇచ్చిన డైరక్టర్

సినిమా తీసి దర్శకుడికి గౌరవం ఇవ్వడం అనేది ఆ సినిమాలో నటించే నటీనటుల ప్రథమ ప్రాధాన్యత.కానీ ఇండస్ట్రీ లో అలాంటి పరిస్థితి ఎప్పుడు కనిపించట్లేదు.

 N Shankar Strong Dose To Hero Rajasekhar , N Shankar , Rajasekhar ,sunil , Aa-TeluguStop.com

హీరో ను మాత్రమే అందరూ గౌరవించాలి అనే విధానం నడుస్తోంది.అందుకే కొంతమంది దర్శకులు హీరోలకు ఊడిగం చేయలేక సలాం కొట్టలేక ఎంత టాలెంట్ ఉన్న ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు.

అలా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయలేక మంచి టాలెంట్ ఉన్న దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు ఎన్ శంకర్.తెలంగాణ నేపథ్యంలో జై బోలో తెలంగాణ అనే సినిమా తీసి తాను తెలంగాణ వాడిని అంటూ గర్వంగా చెప్పుకున్నాడు శంకర్.

Telugu Aayudham, Mohan Babu, Shankar, Rajasekhar, Sunil, Tollywood, Yamajathakud

అయితే శంకర్ కి ఎంతో టాలెంట్ ఉంది అయినా కూడా ఎక్కువగా సినిమాలు తీయలేకపోయారు అతని కెరియర్ మొత్తం మీద 9 తెలుగు సినిమాలు ఒక కన్నడ సినిమా మాత్రమే దర్శకత్వం వహించాడు.మొట్ట మొదట కృష్ణ మరియు అతడి కుమారుడు రమేష్ బాబు లు ప్రధాన పాత్రలో ఎన్కౌంటర్ అనే సినిమా చేశాడు.ఆ తర్వాత వెంకటేష్ తో జయం మనదేరా శ్రీహరితో భద్రాచలం, మోహన్ బాబు తో శ్రిరములయ్య మరియు యమజాతకుడు, రాజశేఖర్ తో ఆయుధం, హీరో రామ్ తో రామ్ అనే సినిమా చేశాడు.ఇక చివరగా తెలుగులో కమెడియన్ సునీల్ హీరో గా 2 కంట్రీస్ అనే చిత్రం చేశాడు.

కన్నడ లో సుదీప్ హీరోగా ఒక సినిమా చేశాడు.

Telugu Aayudham, Mohan Babu, Shankar, Rajasekhar, Sunil, Tollywood, Yamajathakud

అయితే రాజశేఖర్ తో ఆయుధం సినిమా క్రమంలో హీరో టైం కి రాకపోవడంతో అనేకసార్లు ఇబ్బంది పడినట్టుగా చెప్పాడు ఇక మొదట్లో ఉదయం 10 గంటలకు వచ్చే రాజశేఖర్ ఆ తర్వాత మధ్యాహ్నం రెండింటికి ఆ తర్వాత సాయంత్రం 5:00కి అలా షూటింగ్ కి వచ్చేవాడట ఆ రోజు ఎంతో మంది పెద్ద నడుము ఆ సినిమా కోసం డేట్స్ తీసుకుంటే రాజశేఖర్ వల్ల అంతా ఇబ్బంది జరిగేదట అయితే ఒకరోజు రాజశేఖర్ ని కూర్చోబెట్టి మీ సమయం కచ్చితంగా చెప్తే అదే సమయంలో షూటింగ్ అరేంజ్ చేస్తానని చెప్పాడట మీరు పొద్దున పదింటికి వస్తే ఆ రోజు అంతా చాలా వివరంగా సన్నివేశాలన్ని తీస్తానని ఒకవేళ మీరు మధ్యాహ్నం రెండింటికి వస్తే మూడు ముక్కల్లో ఆ సీన్స్ ని పూర్తి చేస్తానని లేదా ఐడెంటికొస్తే ఒకే షాట్లో ఆరోజు చేయాల్సిన మొత్తం షూటింగ్ పూర్తి చేస్తానని ఎలా చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ రాజశేఖర్ కి చెప్పారట.మీరు ఎలా వచ్చిన నేను చేయాల్సిన షూట్ మాత్రం పూర్తి చేస్తానని చెప్పారట.ఆ తర్వాత రాజశేఖర్ రియలైజ్ అయ్యి అప్పటి నుంచి టైం కి రావడం మొదలుపెట్టారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube