వైసిపి రెబెల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వైసిపి టికెట్ పై ఎంపీ పదవి గెలిచినప్పటికీ ఆయన ఫిరాయించిన తీరు జగన్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు, ధైర్యంగా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి ఒక్క అడ్డంకిని ఎదుర్కొన్న తీరు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే.
తాజాగా గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కృష్ణం రాజు కట్ అవుట్ బయటపడిన తీరు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
కోడి పందాలు కూడా భారీగా నిర్వహిస్తున్నారు.గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, వేడుకలు ఘనంగా జరిగాయి.
భీమవరం ప్రాంతం ఈ వేడుకలకు కేంద్రం లాంటిది.ఇక్కడే మన రాజు గారి నియోజకవర్గం కూడా ఉంది.

ఈ సారి సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొనలేకపోయాడు కానీ అతని అభిమానులు మాత్రం తన నియోజకవర్గంలో పెద్ద కట్ అవుట్ పెట్టేసారు చేతిలో కోడిపుంజుతో రఘురాం కృష్ణంరాజు కటౌట్ దర్శనం ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది.సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ చకచక్కర్లు కొడుతుంది.ఈ ఊపు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కృష్ణంరాజు ఏ పార్టీ తరపు పోటీ చేస్తే వారికి గెలుపు ఖాయం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయిజగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పరస్పర చర్యలపై రెబల్ ఎంపీ తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.రచ్చబండ కింద ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన నిప్పులు చెరిగారు.

అయితే ఆయనపై రాష్ట్రంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ ఆయనను గతంలో అరెస్టు చేసింది.బెయిల్ వచ్చిన తర్వాత ఎంపీ ఢిల్లీ, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేనతో మరొక పార్టీ జతకడుతుందని అన్నారు.రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టిస్తుందని, ఆ పార్టీలతో బీజేపీ కూడా చేరే అవకాశం ఉందని సూచించారు.







