100 కోట్ల క్లబ్ లో 'వాల్తేరు వీరయ్య'.. లేటుగా వచ్చిన కుమ్మేస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.సరైన మాస్ సినిమా సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఇప్పటికి మెగాస్టార్ స్టామినా ఎంత మాత్రం తగ్గలేదు అని నిరూపించాడు.

 Waltair Veerayya Day 3 Worldwide Box Office Collection, Waltair Veerayya Collect-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.ఈ శుక్రవారం జనవరి 13న సంక్రాంతి కానుకగా చిరు తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మెగాస్టార్ నటించిన ”వాల్తేరు వీరయ్య” సినిమా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది అనే చెప్పాలి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు.చిరు, మెగాస్టార్ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

పూర్తి స్థాయిలో పాజిటివ్ రాకపోయినా ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.మొత్తానికి మెగాస్టార్ ఖాతాలో మరోసారి 100 కోట్ల సినిమా చేరిపోయింది.వీరసింహారెడ్డి సినిమా కంటే లేటుగా వచ్చిన సినిమాను మించి కలెక్షన్స్ రాబట్టింది.యూఎస్ లో కూడా వాల్తేరు హవా ఏమాత్రం తగ్గడం లేదు.

అక్కడ కూడా 2 మిలియన్ క్లబ్ లో చేరేందుకు సిద్ధం అయ్యింది.ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 47.46 కోట్ల షేర్ కలెక్షన్స్ 76.80 కోట్ల గ్రాస్ ను అందుకుంది.అలాగే ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుని 108 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 27 కోట్లకు పైగానే షేర్ అందుకోవాలి.

మరి ఇప్పటి వరకు హాలిడేస్ కారణంగా బాగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రేపటి నుండి అసలు పరీక్ష మొదలుకానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube