బీఎస్పీ అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ క్రమంలో 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్పీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని చెప్పారు.ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే యోచన లేదని మాయవతి స్పష్టం చేశారు.
పేదల కోసం పని చేసిన బీఎస్పీ యూపీలో నాలుగు సార్లు అధికారం చేపట్టిందని తెలిపారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశముందని ఆరోపించారు.
అనంతరం రానున్న ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.







