టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.గొప్ప ఆశయాలతో ఏర్పడిన పార్టీ టీడీపీ అని అన్నారు.
ఈ క్రమంలో ఎవరంటే వారికి టికెట్లు ఇచ్చి పార్టీ సైద్ధాంతిక బలాన్ని దెబ్బతీయొద్దని విన్నవించారు.పార్టీలో ఓ ముగ్గురు నేతలు ఉన్నారన్న ఆయన వారికి టికెట్ ఇస్తే తాను కచ్చితంగా పని చేయనని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యంలో కాల్ మనీ వ్యాపారస్తులు కూడా భాగం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ చీటర్లకు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు, కబ్జాకోరులకు మాత్రం టీడీపీ టికెట్లు ఇవ్వరాదని తెలిపారు.
అదేవిధంగా తన తమ్ముడు కేశినేని చిన్నకి సీటు ఇస్తే మద్ధతు ఇవ్వనని స్పష్టం చేశారు.మంచివారికి టికెట్ ఇస్తేనే ఎంపీగా గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.







