ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతుంది.ముఖ్యంగా వైసిపి మంత్రి సినీనటి రోజా గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే రోజా చేసిన వ్యాఖ్యలకు గాను మెగా బ్రదర్స్ రికౌంటర్ ఇచ్చారు.ఇక మెగా బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలపై రోజా కూడా ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టు మరోసారి మెగా బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు.
యువశక్తి సభలో భాగంగా పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అంటూ మాట్లాడటంతో రోజా స్పందించి పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని ఆయన రబ్బర్ సింగ్ అంటూ కామెంట్లు చేశారు.

ఇక నాగబాబు గురించి కూడా ఈమె మాట్లాడుతూ… నాగబాబు మనిషి పెరిగాడు కానీ ఆయనకు మాత్రం బుర్ర పెరగలేదంటూ ఈమె కామెంట్ చేశారు.ఇక చిరంజీవి రాజకీయాలలోకి పనికిరారు కనుక ఉన్న మాటే అన్నానని ఆయనతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని రోజా తెలియజేశారు.మేల్ ఈగో అనేది పవన్ కల్యాణ్‌కు, టవర్ స్టార్‌కు బాగా ఎక్కువగా ఉందని ఆమె వెల్లడించారు.
కనీసం సొంతంగా మాట్లాడే టాలెంట్ కూడా వారికి లేదని రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఇంకేమీ తెలియదనీ ఈమె ఎద్దేవా చేశారు.

అమ్ముడుపోయే వ్యక్తులు తమ గురించి మాట్లాడితే అసలు ఊరుకోనని…సొంత జిల్లాలలో గెలవలేని గొట్టం గాళ్లు కూడా నా గురించి మాట్లాడటం చాలా చిల్లరగా ఉందంటూ రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తాను కళాకారులతో డాన్స్ చేస్తేనే వాళ్ళు తనని ట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్లు మాత్రం కూతురు వయసు ఉన్న అమ్మాయితో సినిమాలు చేస్తూ డాన్సులు చేయవచ్చా అని ప్రశ్నించారు.చిరంజీవి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు అవకాశాలు వస్తున్నాయని లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయంలోనూ ఫెయిల్యూర్ అంటూ రోజా ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ప్రస్తుతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







