మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదలయి మొదటిరోజు మంచి ఆదరణ సంపాదించుకుంది.
అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా కాస్త వెనుకబడిందని తెలుస్తోంది.ఈ సినిమా కలెక్షన్లు కాస్త తేడాగా ఉండడంతోనే చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి దర్శక నిర్మాతలకు కొన్ని సూచనలు ఇచ్చారు.అలాగే సినిమా కోసం ప్రతి ఒక్క కార్మికుడు పడే కష్టాన్ని ఒక వీడియోగా చిత్రీకరించి ప్రతి ఒక్క కార్మికుడి కష్టాన్ని అభిమానులకు తెలియజేశారు.

ఇక ఈ సినిమాలు రవితేజ ఏసీపీ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా చాలా హైలెట్ గా ఉందని చెప్పాలి.థాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా రవితేజ గురించి చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా క్లైమాక్స్ లో రవితేజ చనిపోయే సీన్ తనని ఎంతగానో కలిసి వేసిందని ఆ సన్నివేశం షూటింగ్ చేస్తున్న సమయంలో తన మనసు కదిలిపోయిందని రవితేజ తెలిపారు.ఆ సమయంలో రవితేజను చూసి తనకు గ్లిజరిన్ లేకుండానే కళ్ళు నీళ్లు వచ్చాయని రవితేజ తెలిపారు.

ఇక తనని లేపే ప్రయత్నంలో తన చెంపపై కొట్టానని చెబుతూ ఈ కార్యక్రమంలో కూడా రవితేజ చెంప మీద చిరు చేయి చేసుకున్నారు.అయితే రవితేజ సరిపోవడం లేదు అన్నయ్య గట్టిగా కొట్టండని తెలిపారు.ఇక చిరంజీవి రవితేజను దగ్గరకు తీసుకుని తన భుజంపై రవితేజ తలను భుజం పై పెట్టుకొని హగ్ ఇవ్వడం ఈ కార్యక్రమంలో ఎంతో హైలైట్ గా నిలిచింది.ప్రస్తుతం చిరు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







