మంచు లక్ష్మి ఆ చెక్కును ఎంత ప్రయత్నం చేసిన వెనక్కి తీసుకోవడం లేదు : తరుణ్ భాస్కర్

పెళ్లిచూపులు సినిమా తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయింది.షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ గా అప్పటివరకు తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో కొంత పరిచయం ఉన్న వ్యక్తే.

 Tarun Bhaskar About Pelli Chupulu Movie Manchu Lakshmi Details, Tarun Bhaskar ,p-TeluguStop.com

కానీ అతడికి సినిమా అవకాశం ఎవరు ఇవ్వలేదు.తాను రాసుకున్న పెళ్లి చూపులు స్క్రిప్ట్ ని అఖిల్ కి, వరుణ్ తేజ్ కి వినిపించిన వారు నో చెప్పారు.

దాంతో తనకు వేరే ఆప్షన్ లేక థియేటర్ ఆర్టిస్ట్ గా ఉన్న విజయ్ దేవరకొండకు హీరోగా అవకాశం ఇచ్చాడు తరుణ్.

పైగా పెళ్లిచూపులు సినిమాకి అంతకు ముందు వరకు కన్యా రాశి అనే పేరు పెట్టుకున్నాడట తరుణ్ భాస్కర్.

ఒకసారి మంచు లక్ష్మి తర్వాత ఏం సినిమా చేయబోతున్నామని అడగగా కన్యారాశి సినిమా గురించి చెప్పాడట దాంతో ఆవిడకు కథ బాగా నచ్చి అప్పటికప్పుడే ఒక చెక్కు రాసిచ్చి తరుణ్ భాస్కర్ సినిమా చేసి పెట్టమని అడిగిందట.కానీ అనుకోకుండా విజయభాస్కర్, రీతు వర్మ హీరో హీరోయిన్ గా సెట్ అయిపోయి టైటిల్ కూడా మారి పెళ్లిచూపులుగా ఒక హిట్ సినిమా వచ్చింది.

అయితే మంచు లక్ష్మి ఇచ్చిన చెక్కు ఇప్పటికీ తన దగ్గరే ఉందని ఎప్పటికైనా తనకు మంచి సినిమా చేసి పెట్టమని ఆవిడకి చెక్కు రిటన్ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా తీసుకోవడం లేదంటూ తరుణ్ భాస్కర్ ఆ మధ్య ఒకసారి చెప్పారు.ఇక తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాకి ముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేయలేదు.ఎలాంటి పని చేసినా అనుభవము లేదు.

కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీస్తూనే తన ప్రతిభ ఏంటో చాటుకున్నాడు.దాని కారణంగానే పెళ్లి చూపులు సినిమా తీసి అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇక వెంకటేష్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తరుణ్ ఆ మధ్య తెలిపాడు.

కరోనా కారణంగా అది వాయిదా పడుతూనే వచ్చిందని ప్రస్తుతం ఇప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి పని మొదలవలేదంటూ చెప్పాడు తరుణ్ భాస్కర్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube