బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం రెండవ సీజన్ కూడా ముగింపు దశకు చేరుకుంది.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమంలో వీరసింహారెడ్డి టీం సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ మైత్రి నిర్మాత కూడా హాజరై సందడి చేశారు.
అయితే ఈ ఎపిసోడ్ 13వ తేదీ ప్రసారమైన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి మొదట గోపీచంద్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ మొదట రావడంతో బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ ను పక్కకు వెళ్ళమని వరలక్ష్మి శరత్ కుమార్ కు హగ్ ఇచ్చారు.

ఇక ఈయన అనంతరం గోపీచంద్ హత్తుకున్నారు.ముందు తనని హగ్ చేసుకున్నానని బాధపడ్డావా లేడీస్ ఫస్ట్ కదా అందుకు తనని హగ్ చేసుకున్నాను అంటూ బాలయ్య కామెడీ చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో ప్రశ్నలు అడిగినటువంటి బాలకృష్ణ మీ ఇద్దరిలో నా గురించి ఎవరికీ బాగా తెలుసు అని చిన్న టెస్ట్ చేశారు.ఈ క్రమంలోనే బాలయ్య ప్రశ్నలు వేస్తూ నేను తరచూ వాడే పదం ఏంటి అని ప్రశ్నించగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.
చంపుతా నా కొడకా అని యాక్షన్ తోపాటు చేసి చూపించింది.

ఇక గోపీచంద్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ…లమ్xx కొడకా అని చెప్పాడు.అయితే వీరిద్దరి సమాధానాలు విన్నటువంటి బాలకృష్ణ తాను చెబుతానని చంపుతా.లమ్xx కొడకా అని అన్నాడు.
హా అదే అంటారు అని వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ తరచూ ఉపయోగించే బూతు పదం గురించి చెప్పారు.ఇలా బాలయ్య టాక్ షోలో వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్ గోపిచంద్ బాలయ్య ముగ్గురు కలిసి బూతు పదాలతో గోలగోల చేశారు.
ఇక నా గురించి నువ్వు ఇంకా ఏం తెలుసుకున్నావు అని బాలకృష్ణ ప్రశ్నించగా అందరూ మీకు కోపం ఎక్కువ అంటారు.కానీ మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది సాధారణంగా నేనే హైపర్ అనుకుంటాను కానీ మీరు నాకన్నా హైపర్ అంటూ బాలయ్య గురించి చెప్పారు.







