ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో బెజవాడ రాజకీయాలు హీటెక్కాయి.ముఖ్యంగా విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
సొంత పార్టీలోనే అసంతృప్తితో ఉంటూ వస్తున్న ఆయన ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు.అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనేది అనుమానంగానే ఉంది.
రాబోయే ఎన్నికల్లో నానికి ఎంపీ టికెట్ చంద్రబాబు ఇస్తారా లేదా అనేది కూడా సందేహంగా మారింది.ఇది ఇలా ఉంటే తాజాగా చేసిన నాని సొంత పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పై పరోక్షంగా విమర్శలు చేశారు .ఎక్కడా ఉమా పేరు ప్రస్తావించకుండా ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎవరైనా సరే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని ఇగో కు పోతే ప్రజలే సమాధానం చెప్తారని ఉమాను ఉద్దేశించి నాని సెటైర్లు వేశారు.
నేనే సామంత రాజునని విర్రవీగితే ప్రజలు కృష్ణా నదిలో ఈడ్చి కొడతారని విమర్శించారు.పార్టీలో యువతరానికి అవకాశం ఇచ్చేందుకు సీనియర్లంతా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని నాని సూచించారు.
జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిందేనని నాని అన్నారు.

” నేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి.8సార్లు మంత్రి అవ్వాలంటే ప్రజలు ఊరుకోరు.నేను ఎంపీ అని , నాకు రెండు కొమ్ములు ఉన్నాయని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఊరికించి కొడతారు.
ఇదేమి రాజరిక వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యం ‘ అంటూ నాని తనదైన శైలిలో ఉమా పై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని నాని అన్నారు .యూ లవ్ మీ.ఐ డోంట్ లవ్ యూ అంటే కుదరదు అన్నారు.యూ లవ్ మీ.ఐ లవ్ యూ అంటూ రెండువైపులా కలిసి వెళ్తేనే ఇదే సాధ్యమవుతుందని నాని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు కేటాయించాలని సూచించారు ఈ సందర్భంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం పైన నాని స్పందించారు.అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఏ పార్టీలో ఉన్నారో ముందు చెప్పాలని నిలదీశారు.బెజవాడ ఎంపీగా వైసిపి ఎమ్మెల్యే సభకు తాను కూడా వెళ్తానని ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తున్నారు కాబట్టి మైలవరం నియోజకవర్గానికి ఎంపీ నిధులను కేటాయించినట్లు నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
.






