కొడాలి నాని అష్ట దిగ్బంధనం..?

ఏపీ రాజకీయాల్లో.గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక స్థానం ఉంది.

 Tdp Political Strategy In Ap , Kodali Nani, Ex Minister Kodali, Jr Ntr, Tara-TeluguStop.com

జూనియర్ ఎన్టీయార్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.హరికృష్ణ హాయం లో గుడివాడ ను టీడీపీ కంచు కోటగా మార్చారు.

టిడిపి లో ఉండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలుపొందారు.తర్వాత మారిన రాజకీయాల దృష్ట్యా.

వైసీపీ లో చేరారు.అయితే చంద్రబాబు పై మాత్రం అపారమైన కోపమా తో ఉంటారు.

ప్రెస్ మీట్ పెట్టాడు అంటే చాలు.బాబును బూతులు తిట్టనీదే చాలించడు.

ఇక టీడీపీ నేతలు నాని అంటే వనికిపోతారు.అయితే అయన పేరుకు లాంటి మాటలు మాట్లాడినా.

నియోజక వర్గం లో మాత్రం గట్టి పట్టు ఉన్న నేత.టిడిపి నుంచి బయటకు వచ్చిన తరవాత కూడా ఓటములు చూడలేదు.జగన్ వెంటే నడిచి మంత్రి అయ్యారు.

కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల మంత్రి పదవి పోయింది.

అయితే అయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.టీడీపీ అధిష్టానం మాత్రం ఈ సారి కొడాలి పై గట్టి ఫోకస్ పెట్టింది.

ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలి అని కంకణం కట్టుకుంది.కొడాలి నానిని ఓడించి ఇంటికి పంపితే వైసీపీ నీ సునాయాసంగా ఎదురుకోవచ్చు.

అని ప్లాన్ చేస్తున్నారు.

Telugu Chandrababu, Cm Jagan, Kodali, Gudivada Tdp, Jr Ntr, Kodali Nani, Lokesh,

అందుకే కొడాలి నానికి ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యర్థి గా నిలపాలి అని చూస్తున్నారు.అయితే జూనియర్ ఒప్పుకోక పోవడం తో.అయన అన్న అనిన నందమూరి తారక్ రత్నా ను రంగం లోకి దించడానికి చూస్తూ ఉన్నారు.గుడివాడలో నందమూరి అభిమానులు గట్టిగా ఉంటారు.వాళ్ళను తిరిగి టీడీపీ వైపు తిప్పుకోవాలి అని చంద్రబాబు చూస్తున్నారు.

Telugu Chandrababu, Cm Jagan, Kodali, Gudivada Tdp, Jr Ntr, Kodali Nani, Lokesh,

అందుకే ఇటీవల తారక రత్నను పిలిపించి స్వయంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు .తారక రత్న కూడా.ఈ సారి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు.అందుకే ఈ సారి తారక్ రత్న ను గుడివాడ లో దింపాలి అని చూస్తూ ఉన్నారు.అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు.ఒకవేళ.

అంతా ఊహించి నట్టు తారక్ రంగం లోకి దిగితే.అటు నందమూరి అభిమానులు.

టీడీపీ సానుభూతి పరులు.కలిపి కొడాలి నీ అష్ట దిగ్బంధనం చేయాలని చూస్తున్నారు.మరి నిజంగా అష్ట దిగ్బంధనం పని చేస్తుందా.? లేక కొడాలి గెలిచి బాబును గేలి చేస్తారా చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube