మన దేశంలో చిన్న కార్పోరేటర్ అయినా.ఏ మూలనో వార్డ్ మెంబర్ అయినా.మామూలు అత్యుత్సాహం ఉండదు.ఇక సర్పంచొ, ఎంపీటీసీనో అయితే.ముఖ్యమంత్రి రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు.ఇక అక్కడక్కడా నిరాడంబరంగా ఉండే నాయకులు ఉన్నా.
వాళ్లు కూడా వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలోనే ఉంటారు.మరి రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు.
వారి రేంజే వేరు.వారి హుందాతనం.సెక్యూరిటీ.పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది.
ఇలాంటి పబ్లిసిటీని వదిలేసి సింప్లిసిటీతో ఉండే నాయకులు చాలా అరుదుగా ఉంటారు.అయితే అలాంటి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా.
తమ వృత్తిని మాత్రం మర్చిపోరు.అలాంటి నేతే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.
త్రిపుర రాష్ట్రంలోని హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో డాక్టర్ గా మారి ఏకంగా పదేళ్ల బాలుడికి డెంటర్ సర్జరీ చేశారు.

సీఎం సాహా స్వయానా డెంటర్ డాక్టర్ కావడంతో… ఈ శస్త్ర చికిత్స చేశారు.ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా చెప్పుకున్నారు.తాను గతంలో పనిచేసిన త్రిపుర మెడికల్ కళాశాలలో.
పదేళ్ల అక్షిత్ ఘోష్ అనే బాలుడికి ఓరల్ సిస్టిక్ లెషన్ సర్జరీ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు.చాలా విరామం తర్వాత సర్జరీ చేసినా, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.

పేషెంట్ ఆరోగ్యం బాగుంది’’ అని మాణిక్ సాహ ట్వీట్ పెట్టారు.రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కళాశాలలో డాక్టర్ మాణిక్ సాహ ప్రొఫెసర్ గా వైద్య పాఠాలు బోధించేవారు.ఉదయం 9 గంటలకు సర్జరీ రూమ్ కు వచ్చిన డాక్టర్ సాహ అరగంట తర్వాత నవ్వుతూ బయటకు వచ్చేశారు.ఆయనకు పలువురు వైద్యుల బృందం సర్జరీలో సాయపడింది.2022 మేలో త్రిపుర సీఎంగా మాణిక్ సాహ అధికారం చేపట్టారు.







