వామ్మో..ఈ తెలుగు హీరోయిన్ ని గుర్తు పట్టారా ? మీ కళ్ళను మీరే నమ్మరు

ఆనంద్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది అందాల ముద్దుగుమ్మ కమలిని ముఖర్జీ.కోల్కతాలో పుట్టి పెరిగిన కమలిని ముఖర్జీ కి చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తి.

 Anand Movie Fame Kamalinee Mukherjee Transformation Pics Viral,kamalinee Mukherj-TeluguStop.com

అందుకే చదువుతున్న సమయంలోనే బొంబాయికి వచ్చి అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.మొదట నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి రేవతి తీసిన ఫిర్ మిలేంగే సినిమాలో నటించగా, శేఖర్ కమ్ముల దృష్టిలో పడింది దాంతో కమలిని ఆనంద సినిమాలో హీరోయిన్ గా పరిచయమయ్యింది.

ఆ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయి లాగా ఎక్కువగా చీరల్లోనే కనిపించి మంచి నటిగా పేరు సంపాదించుకుంది.తొలినాలలో సాయి పల్లవి లాగా ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉండి సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో కాస్త డోసు పెంచినప్పటికీ ఆమెకు కెరియర్ కొనసాగలేదని చెప్పాలి.


గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత ఆమె తెలుగు తెరపై నుంచి మాయం అయిపోయింది.కమలిని ప్రస్తుతం ఏం చేస్తుంది ? ఎక్కడ ఉంది ? అనే విషయాలు ఎక్కడా కూడా కనిపించలేదు.ఇక కమలినికి బేకింగ్ అంటే చాలా ఇష్టం, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బేకింగ్ వంటలు చేయడం నేర్చుకుంది కాబట్టి బేకింగ్ బిజినెస్ లో బిజీగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని విధంగా బేకింగ్ బిజినెస్ లో సెటిల్ కాలేదు.

కమలిని అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిలైపోయిందట.ఇంకా అమే పెళ్లి కూడా చేసుకోలేదు కానీ ఇటీవల డల్లాస్ లో ఒక ఈవెంట్ లో పాల్గొంది.

అస్సలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా లావు అయిపోయిన కమలిని చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.మన ఆనంద్ సినిమాలోని కమలిని ఈమెనా అని పోల్చుకోలేక పోతున్నారు.నీలిరంగు బట్టల్లో బొద్దుగా ఉన్న కమలిని మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఈ కమలేని పరిస్థితి ఒకవేళ గనుక మళ్లీ ఇండస్ట్రీకి వస్తే వదిన అక్క క్యారెక్టర్లు మాత్రమే వచ్చేలా ఉన్నాయి.

ఇక సినిమాల మీద ఆశ వదిలేసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్.

Anand Movie Fame Kamalinee Mukherjee New Look Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube