కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలను, తెలంగాణలోని గ్రామ పంచాయతీలను పరిశీలించి బేరీజు వేద్దామన్నారు.
తెలంగాణ పంచాయతీల కంటే మెరుగ్గా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
కేంద్రం ఇచ్చే అవార్డులన్నీ తెలంగాణకే వస్తున్నాయని పేర్కొన్నారు.కేంద్రం నిధులను మళ్లించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
గ్రామ పంచాయతీలకు నెలవారిగా ఇచ్చేది ఇస్తున్నామని వెల్లడించారు.గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిధులు ఇస్తుందని వెల్లడించారు.కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలన్నారు.ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై చర్చకు సిద్ధమని మంత్రి ఎర్రబెల్లి సవాల్ చేశారు.