బాబుకి దగ్గర... భాజపాకు దూరం?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు.ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసే దిశగా స్పష్టమైన సూచనలు ఇస్తున్న జనసేన పార్టీకి బిజెపితో సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.

 Pawan Kalyan To Cut Ties With Bjp Details, Bjp, Chandrababu, Janasena, Pawan Kal-TeluguStop.com

గతంలో టిడిపి బిజెపి కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే 2014 ఎన్నికల వారు ఘనవిజయం సాధించారు.ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయింది పరిస్థితి.

2018 లో చంద్రబాబు బిజెపిని కాదని కాంగ్రెస్ తో చేతులు కలిపారు.ఇక పవన్ కళ్యాణ్, బిజెపి పెద్దగా ప్రభావం చూపించలేదు.

అటుపక్క బాబు ఓట్లు కూడా భారీగా చీలిపోయాయి.ఈ కారణంతోనే బిజెపి మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలిపేందుకు అసలు సిద్ధంగా లేదు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి తో తప్పక కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సమయంలో ఎప్పటినుండో కలిసి ఉన్న బిజెపితో అతను సంబంధాలు తెంచుకోవడం కూడా ఒక రకంగా ప్రతికూల అంశమే.కేంద్రం నుంచి మాత్రం ఏపీ రాష్ట్ర బిజెపికి స్పష్టమైన ఆదేశాలు వచ్చేసాయట.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి పార్టీతో జత కలిసే అవకాశం లేదు అన్నది దాన్ని సారాంశం.

మరి పవన్ కళ్యాణ్ తో ఈ విషయమై ఎలాంటి చర్చలు ముందు రోజుల్లో జరగనున్నాయో చూడాలి.

మరొక పక్క చంద్రబాబు మాత్రం సిపిఐ సిపిఎం వర్గాలను కూడా కలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.ఎలాగూ పవన్ కళ్యాణ్ పొత్తుకి ఆసక్తిగానే ఉండటం వల్ల బిజెపికి రాష్ట్రంలో అంత మైలేజ్ లేకపోవడంతో చంద్రబాబుకి పోయేది పెద్దగా ఏమీ లేదు.కానీ పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ మద్దతును కాదని ఆత్మవిశ్వాసం లోపించిన టిడిపి తో చేతులు కలపడం అనేది పెద్ద సవాలే.

మరి టిడిపి కోసం భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహాన్ని పవన్ వదులుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube