మహానటి సావిత్రి అంటే మనకు తెలియని ఒక ఎమోషన్.ఏ తప్పు చెయ్యకపోయినా ఆమె శిక్ష అనుభవించి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.
భర్త చేసిన మోసాన్ని దిగమింగుకొని బ్రతకలేకపోయింది సావిత్రి.అందుకే మద్యానికి బానిసై కన్ను మూసింది.
ఆమె సినిమా జీవితం, వ్యక్తిగత జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదు ఆమెను చూసే నేర్చుకోవాలని ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో స్టేజీల పైన చెప్పడం చూస్తూనే ఉన్నాం.
అదంతా పక్కన పెడితే సావిత్రి వారసత్వాన్ని మాత్రం ఎవరు అందిపుచ్చుకోలేదు అనే బాధ ఆమె అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సావిత్రి మనవడు కూడా మన తెలుగు నటుడే అని, పైగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా.
సావిత్రి జెమినీ గణేషన్ లకు ఇద్దరు సంతానం.కొడుకు రమేష్, కూతురు విజయ చాముండేశ్వరి.కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు వారికి కూడా ఒక కొడుకు ఉన్నాడు.అయితే సావిత్రి కొడుకు రమేష్ కి సంబందించినా వారెవరు కూడా ఇండస్ట్రీకి రాలేదు.
కానీ విజయ చాముండేశ్వరి రెండవ కొడుకు అయినా అభినయ్ కి మాత్రం తన అమ్మమ్మ పోలికలు వచ్చాయి.

అతడు నటనలో సావిత్రి ని గుర్తు చేస్తున్నాడు.సావిత్రి బతికున్నప్పుడే విజయ చాముండేశ్వరి పెద్ద కుమారుడు పుట్టాడు.అతడి పేరు అరుణ్.
అతడికి 5 వ ఏట వచ్చినప్పటికి సావిత్రి గారు కన్నుమూశారు.కానీ అభినయ్ ఎప్పుడు సావిత్రమ్మను చూడలేదు.
అలాగే చిన్నతనం నుంచి అభినయ్ సావిత్రి ఫోటోని తన స్టడీ టేబుల్ పై పెట్టుకొని ఆమెను చూస్తూ పెరిగాడు.అభినయ్ ఎప్పుడైతే నటించాలని డిసైడ్ అయ్యాడో అప్పుడు దాసరి నారాయణరావు అతడిని యంగ్ ఇండియా అనే సినిమాతో నటుడిగా మార్చారు.
నిజానికి అభినయ్ కేవలం నటుడు మాత్రమే కాదు, నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కూడా.

అందరూ అతడు స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ తో, స్పోర్ట్స్ మెన్ అవుతాడని భావించారు కానీ ఎప్పుడు నటుడుగా మారాడో తెలియదు కానీ నటన అంటే అభిమానం పెంచుకున్నాడు.తాను చాంపియన్ గా నిలబడమే కాదు.ఎంతో మందికి టేబుల్ టెన్నిస్ లో కోచింగ్ కూడా ఇచ్చాడు అభినయ్.
ఇక సావిత్రి లాగానే అందరిని ఆదుకోవాలని అనుకుంటున్నాడు.ఇప్పటికే వ్యవసాయం చేసి అప్పుల పాలైన రైతులకు సహాయం చేయడం కూడా మొదలుపెట్టాడు అభినయ్.
ఇక బిగ్ బాస్ 5 తమిళ్ లో పాల్గొని జెమినీ గణేషన్, సావిత్రమ్మల వారసత్వాన్ని నిలుపుతున్నాడు.ఇక అభినయ్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.







