శాకుంతలం ట్రైలర్ పై స్పందించిన రష్మిక... సమంతను రష్మిక ఏమని పిలుస్తారో తెలుసా?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత శకుంతల పాత్రలోఎంతో ఒదిగిపోయిన నటించారని చెప్పాలి.

 Rashmika Reacts On Samantha Shaakuntalam Trailer Details, Sakunthalam Trailer,-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది అయితే ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ ట్రైలర్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ పై కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలో కూడా స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమా ట్రైలర్ పై స్పందించారు.ఈ సందర్భంగా రష్మిక ఈ ట్రైలర్ పై స్పందిస్తూ ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా ఆల్ ద బెస్ట్ సామీ అంటూ ముద్దుగా సమంతను పిలిచారు.ఇలా ఈ సినిమా ట్రైలర్ పై రష్మిక స్పందించడంతో అభిమానులు రష్మిక సమంతను ముద్దుగా సామి అని పిలుస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.

రష్మిక శాకుంతలం ట్రైలర్ పై స్పందించడంతో సమంత సైతం మిషన్ మజ్ను సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ ఈ సినిమా ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఉంది కంగ్రాట్స్ అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా ఇద్దరు హీరోయిన్స్ తమ సినిమాల గురించి ముచ్చట్లు పెట్టుకోవడంతో వీరిద్దరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube