భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువుదీరిన రామయ్య ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.భక్తులకు బూజు పట్టిన లడ్డూలను ఆలయ అధికారులు అమ్మినట్లుగా తెలుస్తోంది.
ముక్కోటి ఏకాదశి రోజు 50 వేల లడ్డూలు మిగిలాయి.ఈ క్రమంలో బూజు పట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు.
దీంతో అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫంగస్ లడ్డులతో ఫుడ్ పాయిజన్ అయితే బాధ్యత ఎవరిదని మండిపడుతున్నారు.







