మెదక్ జిల్లాలో సజీవ దహనం ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.
టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో ఘటన చోటు చేసుకుంది.కాగా అర్ధరాత్రి సమయంలో కారుతో సహా ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారని సమాచారం.
మంటల ధాటికి మృతుడి డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయింది.కాగా కారు డోర్ లో నుంచి వ్యక్తి ఒక కాలు కాలిపోకుండా బయటపడింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ క్రమంలో కారు వద్ద బ్యాగుతో పాటు సమీప పొదల్లో పెట్రోల్ డబ్బాను గుర్తించారు.
మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.