వందేళ్ల చరిత్ర కలిగిన 'రాబందు' తాజాగా UPలో కనబడింది!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకొని స్థానికంగా చర్చనీయాంశమైంది.అక్కడ ఓ అరుదైన పక్షిని స్థానికులు గుర్తించారు.

 Vulture With A Hundred Years Of History Has Recently Been Seen In Up-TeluguStop.com

మొదట దానిని ఓ మామ్మూలు గ్రద్ద అని అనుకున్నారు.కానీ అనుమానంతో పరికించి చూడగా అసలు విషయం తెలిసింది.

అక్కడి ఈద్గా శ్మశానవాటికలో కనిపించిన ఆ గ్రద్ద తెల్లటి హిమాలయ రాబందు అని తెలుసుకున్నారు.దాని రెక్కలు దాదాపు 5 అడుగుల వరకు వ్యాపించి ఉండటం విశేషం.

కాగా ఆ రాబందు వయసు దాదాపు వందేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దాంతో దీనిని స్థానిక అటవీశాఖ అధికారులకు వారు అప్పగించారు.

ప్రస్తుతం ఈ రాబందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.హిమాలయ గ్రిఫ‌న్ రాబందు ప్రపంచంలోనే అత్యంత‌ అరుదైన పక్షిగా పేరుగాంచినది.

చాలా పెద్దగా ఉండే ఈ హిమాలయ రాబందు.సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లోనే మాత్రమే ఎక్కువగా మనకు తారసపడుతుంది.

ఈ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో.వేల కిలోమీటర్ల దూరం చాలా తేలికగా ప్రయాణిస్తుంది.

కాబూల్, టిబెట్, భూటాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల‌తో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాల‌లో ఈ పక్షి జాతులు ఏక్కువగా కనిపిస్తుంటాయి.దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి125 సెంటీమీట‌ర్లు ఎత్తు.8 నుంచి 9 అడుగుల పొడ‌వైన రెక్కలను కలిగి ఉంటుంది.గ్రిఫిన్ రాబందు మగ, ఆడ జాతులు ఒకే రకంగా కనిపించడం విశేషం.

కాగా ఇవి 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతాయి.ఒక్కోసారి 15 కిలోల వరకు కూడా పెరుగుతాయి.

ఇలాంటి అరుదైన పక్షి దొరకగానే తెచ్చి ఇచ్చినందుకు సదరు అటవీ శాఖవారు అక్కడి స్థానికులను మెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube