ఎన్టీఆర్ ని ప్రశంశలతో ముంచెత్తిన జక్కన్న.. వాటితో కూడా హావభావాలు పలికించగలడు అంటూ?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

 Ss Rajamouli Praises Rrr Hero Jr Ntr Details, Rajamouli, Rrr, Jr Ntr, Praises, R-TeluguStop.com

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది.

ఈ సినిమాతో తారక్, చెర్రీ ఇద్దరు పాన్ ఇండియా హీరోలుగా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా రికార్డుల స్థాయిలో కలెక్షన్స్ కురిపించింది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు భాషలు విడుదల చేసిన విషయం తెలిసిందే.మొన్నటికి మొన్న జపాన్ లో విడుదల చేసిన ఈ సినిమాను తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డీజిఏ థియేటర్స్ లో విడుదల చేశారు.

కాగా ఆ స్క్రీనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.తన ఆల్ టైం ఫేవరెట్ సీన్ గురించి తెలిపాడు.ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీముడో అనే పాట అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ పాటలో తారక్ అద్భుతంగా నటించాడు అని తెలిపాడు జక్కన్న.

తాను దర్శకత్వం వహించిన వాటిల్లో ఈ సీన్ తన ఆల్ టైం ఫేవరెట్ అని, అందులో తారక్ కనుబొమ్మలపై కెమెరాను పెడితే వాటితో కూడా హావ భావాలను పలికించగలడు అంటూ ప్రశంసలతో ముంచేత్తాడు రాజమౌళి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.గత తేడాది విడుదలైన ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు అని చెప్పవచ్చు.

ఇకపోతే ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి అలాగే ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube