ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి.కొన్ని న్యాయస్థానాలలో కొన్ని రకాల కేసులు ఎన్ని రోజులు పోయినా అలాగే సాగుతూనే ఉంటాయి.
అలాంటి ఒక కేసును గెలవడానికి ఒక తండ్రి ఎవరు చేయలేని పని చేశాడు.తన ఇద్దరి కుమార్తెల సంరక్షణ బాధ్యతలు తనకే దక్కేలా కోర్టులో కేసు గెలిచేందుకుగాను ఒక వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఏకంగా లింగమార్పిడి చేసుకున్నాడు.
ఈ ఘటన ఈక్విడర్లో జరిగింది.ఈక్వేడర్ లోని రేమొస్ అనే వ్యక్తి కోర్టులో తన ఇద్దరు చిన్న కుమార్తెల కస్టడీ పోరులో గెలవడానికి చట్టబద్ధంగా తన లింగాన్ని మహిళగా మార్చుకున్నాడు.47 ఏళ్ల రేముస్ పేరు ఇప్పుడు ఈక్వడార్ లోనే అధికారిక పత్రాలలో స్ర్తీ జాబితా చేయబడింది.తన దేశంలోని న్యాయ వ్యవస్థ కారణంగా తండ్రి ఈ ప్రయత్నం చేశాడు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈక్విడర్ చట్టాలు పిల్లల సంరక్షణ విషయానికి వస్తే తండ్రుల కంటే తల్లుల వైపే మగ్గుచూపుతాయి.

రామోస్ తన లింగాన్ని చట్టబద్ధంగా మార్చుకున్న తర్వాత అతను మాట్లాడుతూ ఈ దేశంలో ఇప్పుడు తండ్రిగా ఉన్నందుకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.వారి తల్లితో హింసాత్మక వాతావరణం లో జీవిస్తారని ఐదు నెలలుగా తన పిల్లలను కలవలేదని వెల్లడించారు.చట్టాలు పిల్లలను పెంచడం స్త్రీ హక్కు అని చెబుతున్నాయి.నాటికి నేను స్ర్తీని, ఇప్పుడు నేను కూడా ఒక తల్లిని అలాగే నన్ను నేను భావించుకుంటున్నాను.

నా లైంగికత గురించి నాకు చాలా నమ్మకం ఉంది.నేను కోరుకున్నది నేను తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను.తద్వారా నేను తల్లి ప్రేమ మరియు రక్షణను కూడా ఇవ్వగలను.అయితే రామోస్ తీసుకున్న ఈ చర్య దేశవ్యాప్తంగా ట్రాన్స్ ప్రజలకు కోపం తెప్పించాయి.ఎల్ జి బి టి ఐ ఆర్గనైజేషన్స్ రామోస్ యొక్క నీగ్రహమైన చర్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.అయితే ఈ కేసు కోర్టులో ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.







