తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావడంపై మరోసారి సందిగ్ధత నెలకొంది.పోలీసులు అందజేసిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ మాట్లాడుతూ సునీల్ కనుగోలుకు నోటీసులు అంజదేశామని తెలిపారు.విచారణకు సహకరించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా విచారణకు వస్తానని సునీల్ సమాచారమిచ్చారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు వస్తే విచారించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అయితే, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.







