ఈ ఆయిల్ ను వాడితే చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందొచ్చు!

చుండ్రు.అత్యధిక శాతం మందిని తీవ్రంగా సతమతం చేసే సమస్యల్లో ఇది ఒకటి.

 A Powerful Anti Dandruff Oil For You! Anti Dandruff Oil, Dandruff, Hair Care, Ha-TeluguStop.com

చుండ్రు కారణంగా తలలో దురద, చిరాకు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాగే తలలో చుండ్రు ఉంటే హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు అధికమవుతాయి.

అందుకే చుండ్రును వదిలించుకోవడం కోసం ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి.అలాగే ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ లో తీసుకుని అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్ ను వేసుకోవాలి.అలాగే దంచి పెట్టుకున్న ఉల్లి ముక్కలు మరియు వెల్లుల్లి తురుము వేసి బాగా కలిపి ఒక గంట పాటు వదిలేయాలి.

ఆ తర్వాత గ్లాస్ జార్ ను మరుగుతున్న నీటిలో కనీసం ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.ఆపై ఆయిల్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన‌ అనంతరం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేసుకుని పడుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు చాలా త్వరగా దూరమవుతుంది.అలాగే మళ్లీ మళ్లీ రాకుండా సైతం ఉంటుంది.చుండ్రు సమస్యతో సతమతం అయ్యే వారికి ఈ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.తెల్ల జుట్టు సైతం త్వరగా రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube