చిరంజీవి రాజకీయాలకు ఏమాత్రం సెట్ అవ్వరు... డైరెక్టర్ బాబీ షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఈ సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Chiranjeevi Is Not Set For Politics At All Director Bobby Shocking Comments Deta-TeluguStop.com

ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్య రాజకీయాలకు ఒక్క శాతం కూడా సెట్ అవ్వరని తెలిపారు.

ఆయన రాజకీయాలలోకి వెళ్లే ఇతరులను ఎదిరించి వారిని ప్రశ్నించలేరు.

అందుకే దేవుడు తనకు పవన్ కళ్యాణ్ ని తమ్ముడికి ఇచ్చారని పవన్ రాజకీయాలకు సరైనోడు అంటూ బాబి తెలిపారు.అన్నయ్యలోని మంచితనం, ఆవేశం కలిస్తేనే పవన్ కళ్యాణ్.ఆయన మాటకు మాట కత్తికి కత్తి అనేలా ఇతరులను ప్రశ్నిస్తూ వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతారని బాబి తెలిపారు.

అందుకే చిరంజీవి అన్నయ్యకు రాజకీయాలు సూట్ అవ్వవు అని బాబి తెలిపారు.

ఇక తాను చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చాను.అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన 20 సంవత్సరాలకు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు.అయితే తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు గల కారణం రవితేజ గారు.

ఆయన నాపై నమ్మకం ఉంచి నాకు అవకాశం ఇవ్వడం వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను అందుకు రవితేజ గారికి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా బాబీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube