ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఐదు అద్భుతమైన సినిమాల లిస్ట్ తీయాలిస్ వస్తే అందులో ఒక స్థానం సంపాదించుకునే చిత్రం దళపతి. ఈ చిత్రంలో ఫ్రేమ్ టూ ఫ్రేమ్, సీన్ టూ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.
సినిమా మొత్తం ఎంతో న్యాచురల్ గా ఉండి ప్రేక్షకుడిని తనతో పాటే క్లయిమాక్స్ కి తీసుకెళ్లేంత గొప్ప సినిమా గా దళపతి కి గుర్తింపు ఉంటుంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య నడిచే సంభాషణలు జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక దళపతి సినిమాలో పాటల గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది.ఒక్కో పాట ఒక్కో అద్భుతంగా అని అనిపిస్తుంది.
సినిమాను డైరెక్ట్ చేయడానికి మని రత్నం ఎలాంటి గొప్ప కసరత్తు చేశారో అనే ప్రశ్న సినిమా చూసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది.మరి ముఖ్యంగా క్లయిమాక్స్ లో రజినీకాంత్ మరియు మమ్ముట్టి మధ్య మాటలు చూడటటానికి మన కళ్ల ముందు లేదా మన ఇంట్లో జరుగుతున్నాయా అనే ఆశ్చర్యం వేయకుండా ఉండదు.
దళపతి సినిమా విడుదల అయ్యి మూడు దశాబ్దాలు గడిచిన నిన్న వచ్చినట్టే అనిపంచేంత మాయ చేసారు.ఇక సౌత్ ఇండస్ట్రీ లో నే ఇది అప్పట్లో మోస్ట్ ఎక్సపెన్సివ్ చిత్రం గా చెప్పుకోవచ్చు.
మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలేవి ఫెయిల్ కాలేదు అని చెప్పడానికి ఈ చిత్రం మరొక ఉదాహరణ.

తల్లి పాత్రలో శ్రీవిద్య నటన ఎంతో చక్కగా కుదిరింది.అలాగే హీరోయిన్స్ గా నటించిన శోభన, గీత మరియు భాను ప్రియా వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు.ఈ చిత్రం ద్వారానే అరవింద్ స్వామి తొలిసారి నటుడిగా పరిచయం అయ్యాడు.
దళపతి సినిమాను తెలుగు లో డబ్ చేయగా, కన్నడ మరియు హిందీ భాషల్లో మాత్రం రీమేక్ చేసారు.ఇలాంటి సినిమాలో నేరుగా ఎందుకు తెలుగు లో తీయరు అనే భావన ఎల్లప్పుడూ సినిమా పేమికుడి మదిలో మెదులుతూనే ఉంటుంది.
ఇక చిరంజీవి మరియు బాలకృష్ణ లాంటి హీరోస్ చేస్తే ఎంతో బాగుంటుంది.అది అయితే కుదరకపోయిన సినిమా హద్దుల్ని చెరిపేసి రాజమౌళి తీసిన RRR సినిమా కూడా ఇలాంటి చిత్రాలు కోవలోకి వస్తాయి.







