పిల్లలు నా దగ్గరకు రావాలంటే భయపడేవారు... నటుడు అజయ్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అజయ్ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి అందరిని భయపెట్టారు.అలాగే మరికొన్ని సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రాలలో నటించి సందడి చేశారు.

 Children Used To Be Afraid To Come Near Me Actor Ajay Shocking Comments,actor Aj-TeluguStop.com

అయితే తాజాగా ఈయన కోలీవుడ్ హీరో అజిత్ నటించిన తునివు అనే సినిమాలో నటించారు.ఈ సినిమా తెలుగులో తెగింపు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు అజయ్ తన సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.

తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలలో నటించానని తెలిపారు.అయితే ఇలాంటి విలన్ పాత్రలలో నటించడం వల్ల బయట నన్ను చూసిన చాలా మంది భయపడేవారని ఈయన తెలిపారు.

ముఖ్యంగా విక్రమార్కుడు సినిమాలో తాను నటించిన విలన్ పాత్ర అందరిని తీవ్ర భయాందోళనలకు గురి చేసిందని ఈ సినిమా చేసిన తర్వాత పిల్లలు కనీసం నా దగ్గరకు రావాలన్నా కూడా భయపడేవారు అంటూ ఈయన తెలిపారు.అదేవిధంగా ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రమాదానికి గురయ్యానని, కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని ఈయన గత విషయాలను గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం అజయ్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube