పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ జోరు మీద ఉన్న విషయం తెలిసిందే.తన ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు.
ఈయన బాహుబలి సినిమా తర్వాత భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.ఒకేసారి అరడజను సినిమాలను లైనప్ చేసుకుని ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.
ప్రెజెంట్ ఈయన ఒకేసారి నాలుగు సినిమాలను పూర్తి చేస్తూ బిజీగా ఉన్నాడు.ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా షూట్ ప్రెజెంట్ శరవేగంగా జరుగుతుంది.షూట్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ చెప్పకపోయినా ఈ సినిమా షూట్ మాత్రం సైలెంట్ గా జరుగుతుంది అని తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో డార్లింగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే.
ఈ ముగ్గురిలో మాళవిక మోహనన్ ఒకరు.తాజాగా మారుతి కొత్త షెడ్యూల్ కి టీమ్ మొత్తాన్ని రెడీ చేస్తున్నారట.
ఈ షెడ్యూల్ లో మాళవిక మోహనన్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాకే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట.ప్రభాస్ – మారుతి కాంబోలో ఫన్నీతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నారని.ఈ మధ్యలోనే మాళవికతో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.
మరి వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఎలా ఆకట్టు కుంటాయో చూడాలి.ఇక ఈ సినిమాలో మరొక ఇద్దరు కథానాయికలు మెహ్రీన్, రిద్ది కుమార్ అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.







