విజయనగరం జిల్లాలో కరోనా కలకలం చెలరేగింది.విదేశాల నుంచి వచ్చిన దంపతులకు విశాఖ ఎయిర్ పోర్టులో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈనెల 1వ తేదీన ఆస్ట్రేలియా నుంచి గరుడుబిల్లికి చెందిన దంపతులు విశాఖకు వచ్చారు.దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు విశాఖ వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించారు.
దీంతో దంపతుల శాంపిల్స్ ను అధికారులు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ల్యాబ్ కు పంపారు.దంపతులు ఇద్దరూ మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యులు తెలిపారు.
అనంతరం దంపతులను బొండపల్లిలోని హోం ఐసోలేషన్ కు తరలించారు.







