దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది.కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లు బెయిల్ పొందారు.
మరోవైపు లిక్కర్ స్కాంపై ఈడీ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.







