కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

సాధారణంగా కొందరి ముఖ చర్మం చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది.ఆహారపు అలవాట్లు, కాలుష్యం, కఠినమైన సోప్స్ ను వాడటం, హార్మోన్ చేంజ్, మద్యపానం, ధూమపానం, కెమికల్స్ అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.

 A Simple Tip To Make Rough Skin Super Smooth Is For You! Simple Tip, Rough Skin,-TeluguStop.com

దాంతో ముఖంలో కాంతి తగ్గిపోతుంది.ఈ క్రమంలోనే చర్మాన్ని మృదువుగా మార్చుకునేందుకు మార్కెట్లో లభ్యం అయ్యే రకరకాల ఉత్పత్తుల‌ను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా మాత్రం మీ చర్మాన్ని సూపర్ స్మూత్ గా మారుస్తుంది.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ములేటి పౌడర్..

దీనిని అతిమధురం అని కూడా పిలుస్తారు.అతి మధురంలో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అతి మధురాన్ని ఆయుర్వేద వైద్యం అత్యంత శక్తివంతమైన మూలికగా చెప్తుంది.ఆయుర్వేద మందుల తయారీలో ఈ మొక్క వేర్ల చూర్ణాన్ని విరివిరిగా వాడుతుంటారు.

అలాగే అతిమధురం చర్మ సౌందర్యానికి సైతం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా చర్మాన్ని మృదువుగా మార్చడంలో ఈ పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ములేటి పౌడర్ ను వేసుకోవాలి.అలాగే చిటికెడు పసుపు, మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే కఠినమైన చర్మం కొద్ది రోజుల్లోనే స్మూత్ గా మారుతుంది.పైగా ఈ చిట్కా\ను పాటించడం వల్ల చర్మం పై మొండి మచ్చలు ఏమైనా ఉన్నా సరే దూరమవుతాయి.

కాబట్టి కఠినమైన చర్మంతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ టిప్ ను పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube