ప్రముఖ టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టిల గురించి మనందరికీ తెలిసిందే.కాగా అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇకపోతే రాహుల్,అతియా గత కొంతకాలంగా ప్రేమలో మునికి తేలుతున్నారు అంటూ వార్తలు దూరంగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా గత ఏడాది వీళ్లిద్దరూ ఒక్కటికాబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
దాంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే ఆ వార్తలు అన్ని వాస్తవాలు అని తేలిపోవడంతో 2023లో అయినా ఈ జంట ఒక్కటవుతుందేమో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ జంట ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి ఈ జంట వార్తల్లో నిలిచారు.
న్యూ ఇయర్ సందర్భంగా దుబాయిలో సందడి సందడి చేశారు రాహుల్,అతియా శెట్టి.అందుకు సంబంధించిన విషయాన్ని కెఎల్ రాహుల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
అంతేకాకుండా దుబాయ్ లో సందడి చేసిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ఆ ఫోటోలలో రాహుల్, అతియా శెట్టి ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్సులు ధరించారు.
అంతే కాకుండా ఇద్దరు కలిసి వారి ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు రాహుల్.ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు పెళ్లెప్పుడు అని వారిని ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే అతియా శెట్టి విషయానికి వస్తే.
ఆమె 2015 లో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో సూరజ్ పంచోలితో కలిసి నటించిన రొమాంటిక్ మూవీ హీరో సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఆమె చివరిసారిగా మోతిచూర్ చక్నాచూర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అందులో నవాజుద్దీన్ సిద్ధికి సరసన నటించి మెప్పించింది.
కాగా కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు వారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ, క్యూట్ కపుల్,సూపర్ జోడి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.