తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి అన్ని పార్టీ మద్ధతు ఇవ్వాలన్నారు.బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే మిగిలిన పార్టీలు కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలని తెలిపారు.పార్టీలు స్పందించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించారు.
మోదీ మాటలు చెప్పడం తప్ప చేతలు శూన్యమని విమర్శించారు.దేశానికి ప్రత్యామ్నాయ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని వీహెచ్ స్పష్టం చేశారు.







