సమంత ఫ్యాన్స్ కు రేపు ఒక సర్‌ ప్రైజింగ్ న్యూస్‌ రాబోతుందట!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆమె సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి తో ఆమె బాధపడుతున్న కారణంగా షూటింగ్ లు ఆగిపోయి చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి.

 Samantha Shakunthalam Movie Release Update , Samantha , Shakunthalam , Gunase-TeluguStop.com

విజయ్ దేవరకొండ సినిమా మొదలుకొని హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర సభ్యులు ప్రకటించారు.సమంత ఆరోగ్యం బాగున్న సమయం లోనే గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం సినిమా లో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా కాలమైంది.మొన్న సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

కానీ చిత్రీకరణ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతుందని విడుదల తేదీ ని వాయిదా వేసినట్లుగా ప్రకటించారు.

ఎట్టకేలకు సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది.

రేపు సినిమా విడుదల తేదీ విషయం లో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.కొత్త సంవత్సరం సందర్భంగా శాకుంతలం యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో సమంత శాకుంతలా దేవి పాత్ర లో కనిపించబోతోంది.

ఈ సినిమా గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతుండగా.దిల్ రాజు సమర్పిస్తున్నాడు. గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా లో సమంత యొక్క పాత్ర విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించి సినిమా పై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయాలని దర్శకుడు గుణ శేఖర్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube