భార్యకు ఖరీదైన బంగ్లా కానుకగా ఇచ్చిన నటుడు రణవీర్... ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రణవీర్ సింగ్ దీపికా పదుకొనే దంపతుల గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగడమే కాకుండా ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

 Actor Ranveer Gave His Wife An Expensive Bungalow As A Gift You Will Be Shocked-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో ఈ దంపతులు పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.వీరు నటించిన సినిమాల వల్ల ఈ ఇద్దరు భారీగా నెటిజన్స్ ట్రోలింగ్ కి గురవుతున్నారు.

ఇలా వీరిద్దరు ఎన్నో వివాదాలలో చిక్కుకున్న పెద్దగా వాటి గురించి ఏమాత్రం స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా రణవీర్ దీపికా పదుకొనే వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో ఇద్దరు వీరి వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తమ పెళ్లి రోజు సందర్భంగా నటుడు రణవీర్ సింగ్ దీపికా పదుకొనేకు ఖరీదైన ఇంటిని కానుకగా ఇచ్చినట్టు సమాచారం.ముంబైలోని సల్మాన్ షారుక్ ఇంటికి దగ్గరలోనే ఒక ఇంటిని కొనుగోలు చేసి తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం.

ఈయన కొనుగోలు చేసిన ఇల్లు 11266 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యధిక సదుపాయాలతో ఉందని తెలుస్తోంది.

ఈ విధంగా అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఈ ఇంటిని రణవీర్ ఏకంగా 119 కోట్ల రూపాయలకు ఖర్చు చేసి కొనుగోలు చేశారట.ఇలా తన భార్యకు ఖరీదైన కానుకను ఇవ్వడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కొత్త ఏడాదిలోనే ఈ దంపతులు కొత్త ఇంట్లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం.ఇక దీపికా సినిమాల విషయానికొస్తే ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube