ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు.
కొద్ది రోజుల క్రితం నాగ్ పూర్ లో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ గతంలో దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అని, నూతన భారతానికి జాతిపిత నరేంద్ర మోదీ అని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా అన్న నితీశ్ కుమార్ కొత్త దేశానికి కొత్త జాతిపిత.
దేశానికి చెప్పుకోదగినదేమైనా చేశారా అని మండిపడ్డారు.







