టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరే తీస్తున్నారు.చంద్రబాబు సభలకు భారీ ఎత్తున జనాలు రావడంతో టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది.
ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు చేస్తున్న కామెంట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు రుజువు చేసే తరహాలో చంద్రబాబు తన ప్రసంగాలతో వైసీపీకి హాడలెత్తిస్తున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో ప్రవేశించారు.కొండపి మండలం కట్ట వారి పాలెంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు.ఈ క్రమంలో స్థానికంగా పొగాకు రైతులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అంతకుముందు కందుకూరు సభలో మరణించిన రాజేశ్వరి అని మహిళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దీంతో చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.







