టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
ప్రజాస్వామ్యం గురించి బాబు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని తెలిపారు.పబ్లిసిటీ కోసం ఎనిమిది మందిని చంపేశారని మండిపడ్డారు.
రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని వెల్లడించారు.సంగం బ్యారేజీ పూర్తి చేయనందుకు చంద్రబాబు సిగ్గుపడాలని పేర్కొన్నారు.
రైతులను దోచుకోవడం తప్ప చంద్రబాబుకు తెలిసిందేమీ లేదని విమర్శించారు.తల్లికి తిండి, తండ్రికి కొరివి పెట్టలేని వాడివి మానవ సంబంధాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.







