కుర్చీని నమ్ముకున్న బాలయ్య.. గన్ ను నమ్ముకున్న చిరు.. ఏం జరిగిందంటే?

2023 సంక్రాంతి సినిమాల హడావిడి ఇప్పటికే మొదలైంది.వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు 24 గంటల గ్యాప్ లో రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో అనే చర్చ జరుగుతోంది.

 Shocking Updates About Waltair Veeraiah Veerasimhareddy Movies Details, Veerasim-TeluguStop.com

ప్రస్తుతానికి కొన్ని విషయాలలో వీరసింహారెడ్డి పైచేయి సాధిస్తే మరికొన్ని విషయాలలో వాల్తేరు వీరయ్య మూవీ పైచేయి సాధిస్తుండటం గమనార్హం.తాజాగా వీరసింహారెడ్డి మూవీ నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది.

ఈ మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చాయి.వీరసింహారెడ్డి సినిమాలో కుర్చీ ఫైట్ హైలెట్ కానుండగా వాల్తేరు వీరయ్య సినిమాలో గన్ ఫైట్ హైలెట్ కానుందని సమాచారం అందుతోంది.ఈ రెండు సినిమాలకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాలపై అంచనాలను అంతకంతకూ పెంచుతోంది.

చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతికి విడుదలైన ప్రతి సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.సంక్రాంతి సినిమాలు సక్సెస్ సాధించి తమ క్రేజ్ ను మరింత పెంచడంతో టాలీవుడ్ ఖ్యాతినిపెంచాలని ఈ హీరోలు భావిస్తున్నారు.చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీకి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో ఏ సినిమా ప్రమోషన్స్ కు శృతి హాసన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది.శృతి హాసన్ ఈ సినిమాలకు వేర్వేరుగా 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఈ రెండు సినిమాల విజయాలు శృతి హాసన్ కు కీలకమనే సంగతి తెలిసిందే.సంక్రాంతికి రిలీజ్ కానున్న అన్ని సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube