న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరింత కిక్కు ఇచ్చింది.ఈ మేరకు మద్యం ప్రియులను నిరాశ పరచకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహించనున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.రాత్రి 10 గంటల తర్వాత పబ్స్ నుంచి సౌండ్ వినిపిడకూడదని ఆదేశించింది.
ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకలు విషాదాంతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.
డ్రంకైన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, టూ వీలర్లపై ట్రిపుల్ రైడింగ్ పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.







