కార్పొరేట్ కంపెనీలలో మీరు ఉద్యోగాలు చేస్తే ఇలాంటి విషయాలు కొత్తేమి కాదు.అవసరాన్ని బట్టి యజమానులు ఉద్యోగులకు, ఉద్యోగులు యజమానులకు కానుకలు ఇస్తూ వుంటారు.
ఉద్యోగులకు బోనస్ లు ఇవ్వడం వంటివి కొత్తేమి కాదుగాని సంస్థలో పనిచేసే బాస్ కు ఉద్యోగులు గిఫ్టులు ఇవ్వడం మాత్రం చాలా అరుదు అని చెప్పుకోవాలి.ఎందుకంటే సాధారణంగా పదవీ విరమణ చేసే సమయంలోనే గిఫ్టులు లాంటివి ఇస్తుంటారు.
అందులోనూ చాలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం కూడా చాలా అరుదు.
అయితే, ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగులు క్రిస్మస్ సందర్భంగా తమ బాస్ కు ఖరీదైన గిఫ్టు ఇచ్చి అవాక్కయేలా చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఆ గిఫ్టును తెరిచి చూసిన ఆ బాస్ కూడా అమితాశ్చర్యానికి గురి కావడం ఇక్కడ గమనించవచ్చు.UKలోని మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లో ఉద్యోగులు అందరూ కలిసి తమ మేనేజర్ కు గిఫ్టు ఇవ్వడం జరిగింది.
కాగా అందులో ల్యాప్ టాప్ ఉంది.కాగా ఆ సమయంలో ఆ గిఫ్టుని తెరిచి చూసిన తరువాత సదరు మేనేజర్ ఇచ్చిన రియాక్షన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ సందర్భంగా సదరు ఉద్యోగులు మాట్లాడుతూ… తమ మేనేజర్ కి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉందని, అందుకే క్రిస్మస్ సందర్భంగా ఈ బహుమతి ఇవ్వాలని అందరం అనుకున్నామని మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులు చెప్పుకొచ్చారు.విధుల్లో భాగంగా తమ మేనేజర్ చూపే నిబద్ధత తమను బాగా ఆకట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా అన్నారు.ఇకపోతే గిఫ్టును చూసి సంతోషపడుతూ మేనేజర్ ఇచ్చిన ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ కి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.







