మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ఈ సినిమా రాబోతున్న నేపథ్యం లో ఖచ్చితంగా కలెక్షన్స్ మరో లెవెల్ అన్నట్లుగా ఉంటాయని బాక్సాఫీస్ వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారు.
ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేయాలి అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉండాలి.సినిమా కు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువ రావాలి అంటే ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
ప్రమోషన్ కార్యక్రమాల్లో ముఖ్యంగా ట్రైలర్ చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటేనే సినిమా కు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువగా నమోదు అవుతాయి.
అందుకే వాల్తేరు వీరయ్య ట్రైలర్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి వాల్తేరు వీరయ్య యొక్క ట్రైలర్ ని కట్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.అంతే కాకుండా ట్రైలర్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ కంపోజ్ చేయించారని కూడా సమాచారం.ఇక ట్రైలర్ లో చిరంజీవి తో పాటు రవితేజ షాట్స్ కూడా ఉండబోతున్నాయి.
రెండున్నర నిమిషాల పాటు ఉండే ట్రైలర్ లో మొత్తం సినిమా యొక్క కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించే విధంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతుంది.ట్రైలర్ ను జనవరి 5వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ట్రైలర్ చూసిన తర్వాత మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఎదురు చూడడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు.ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అవ్వబోతుంది.250 కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతోంది.మరి ఆ స్థాయిలో సినిమా వసూళ్లు సొంతం చేసుకుంటుందా అనేది ట్రైలర్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







