2022 ఏడాది మరొక 24 గంటల్లో పూర్తి కాబోతుంది.కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి అందరు సిద్ధం అవుతున్నారు.
అయితే 2022 ఏడాది మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి లాభాలు అందుకున్నాయి.మరి ఈ సినిమాల వల్ల హీరోల మార్కెట్ మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్స్ క్రేజ్ కూడా అమాంతం పెరిగింది.
ఈ హీరోయిన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.ఈ ఏడాది అయితే నలుగురు హీరోయిన్స్ పేర్లు ఎక్కువుగా వినిపించాయి.మరి 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అనే లిస్టులో నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి.ఆ నలుగురు ఎవరంటే.
రష్మిక మందన్న, పూజా హెగ్డే, శ్రీలీల, మృణాల్ ఠాకూర్.ఈ నలుగురు భామల పేర్లు ఈ ఏడాదంతా బాగా వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే వరుస డిజాస్టర్స్ అందుకున్న సమయంలో ఈమె పేరు నెట్టింట బాగా వినిపించింది.అలాగే ఈమెపై నెగిటివ్ కామెంట్స్ కూడా రావడంతో ఈమె మరింత ఫేమస్ అయ్యింది.అయితే ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసిన ఈమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.దీంతో ఈమెకు ఎలాంటి డోకా లేదు అనే చెప్పాలి.
ఇక రష్మిక మందన్న పేరు కూడా ఈ ఏడాది బాగానే వినిపించింది.ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ వార్తల్లో నిలిచింది.
శ్రీలీల మొదటి సినిమా పెళ్లి సందడి. ఒక్క సినిమాతో ఈమె అరడజను సినిమాల ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకుంది.దీంతో ప్రతీ నిత్యం ఈమె పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
మృణాల్ ఠాకూర్ పేరు కూడా బాగా వినిపించింది.సీతారామం సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఆకట్టుకుంది.సీత పాత్రలో నటించిన ఈమె సీతగా ఆడియెన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది.ట్రెడిషనల్ లుక్ తో అందరిని కట్టి పడేసింది.
ఈమె అందరి కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుని 2022 ఏడాదికి హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచి పోయింది.