తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న త్రిష తర్వాత తమిళ మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
ఇప్పటికీ అదే అందంతో యువతనీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఇక ఈ ముద్దుగుమ్మ అందం గురించి ఆమె అందానికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
నాలుగుపదుల వయసులో కూడా ఇప్పటికీ 23 ఏళ్ల అమ్మ ఇలా కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.
త్రిష ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది.ఇకపోతే త్రిష పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.
కొన్ని కారణాల వల్ల ఆమెనే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది.ఆ తర్వాత అప్పటినుంచి ఆమె పెళ్లి పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
త్రిష బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ త్రిష మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు.

త్రిష ఇప్పటికీ కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అలాగే ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం త్రిష చేతినిండా పెద్దపెద్ద బారి ప్రాజెక్టులు ఉన్నాయి.ఇకపోతే సోషల్ మీడియాలో త్రిష కి సంబంధించిన కొన్ని ఫోటోలు అయ్యాయి.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు త్రిష అందంపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకొందరు అభిమానులు అయితే ఇంత అందాన్ని మేము ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తుండగా, కొందరు ఇంత అందం మెయింటైన్ చేస్తున్నావు సరే పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.
మరి ఈ వార్తలు పై త్రిష ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఎదురైనప్పటికీ ఆమె వాటిని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది.







