దేశానికి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఇటీవలే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశారు.స్నేహితులతో కలిసి ఈ సంస్థను ఏర్పాటుచేసిన ఆయన తన భార్య నుంచి రూ.10 అప్పుగా తీసుకుని ఈ కంపెనీకి పునాది వేశారు.ఇన్ఫోసిస్‌లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి పలు విషయాలు తెలిపారు.తాను సమయానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నానని, అందుకే తాను కార్యాలయానికి రావడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకున్నానని తెలిపారు.గతంలో మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి మాట్లాడుతూ తాను సమయ నిర్వహణ విలువను అర్థం చేసుకున్నానని, ఈ విషయంలో ఇతరుల ముందు ఆదర్శంగా నిలవాలని భావించానని, అందుకే తాను ప్రతిరోజూ ఉదయం ఖచ్చితంగా 6.20 గంటలకల్లా ఇన్ఫోసిస్ కార్యాలయానికి చేరుకునేవాడినని తెలిపారు.ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు నారాయణ మూర్తి సమాధానమిస్తూ, తాను ఇన్ఫోసిస్ కోసం పనిచేసిన రోజుల గురించి గుర్తుచేసుకున్నారు.తాను ఆఫీస్‌కి ఉదయాన్నే చేరుకునేవాడినని, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పని చేసేవాడిని మూర్తి తెలిపారు.
పని, విషయంలోనూ తాను ఇతరుల ముందు ఆదర్శంగా నిలవాలనుకునే నిర్ణయం తీసుకుని, దానిని పాటించానన్నారు.

తాను ఉద్యోగంలో చేరనది మొదలు 2011లో పదవీ విరమణ పొందే వరకు ప్రతి ఉదయం 6:20 గంటలకల్లా ఇన్ఫోసిస్ కార్యాలయానికి చేరుకునేవాడినని వివరించారు.ఇటువంటి తన ప్రవర్తన చూసిన తరువాత, ఆఫీసులోని యువ ఉద్యోగులు కూడా సమయానికి కార్యాలయానికి రావడం ప్రారంభించారన్నారు.ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణ మూర్తి తాను ఇన్ఫోసిస్ నిర్మాణానికి తనకు వీలైనంత సమయాన్ని కేటాయించానని, అయితే ఇదే సమయంలో తన పిల్లలకు సమయం కేటాయించలేకపోయినందుకు బాధపడుతుంటానన్నారు.
ఇన్ఫోసిస్‌ను నిలబెట్టేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని తెలిపారు.ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతూ తన ఇద్దరు పిల్లలయిన రోహత్, అక్షతతో అస్సలు సమయం గడపలేకపోయానన్నారు.పిల్లల పూర్తి బాధ్యత తన భార్య సుధ తీసుకున్నారని తెలిపారు.ఆమె సంరక్షణలోనే పిల్లల చదువులు, కెరియర్ సాగాయన్నారు.
తన భార్య సుధ అందరినీ చక్కగా చూసుకున్నరన్నారు.జీవితంలో తాను పిల్లలతో సమయం గడపలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతుంటానన్నానని నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.







