బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.సూసైడ్ కేసులో మరో అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
సుశాంత్ ది ఆత్మహత్య కాదని పోస్టుమార్టం చేసిన డాక్టర్ చెబుతున్నట్లు సమాచారం.సుశాంత్ మెడపై గుర్తులున్నాయన్న డాక్టర్ రూప్ కుమార్ షా బాడీలో ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయని వ్యాఖ్యనించారు.
పోస్టుమార్టం చేయడంలో తనకు 28 ఏళ్ల అనుభవం ఉందని వెల్లడించారు.డాక్టర్ షా చేసిన వ్యాఖ్యలు బీటౌన్ లో కలకలం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
బుల్లితెర నుంచి బాలీవుడ్ హీరోగా ఎదిగిన సుశాంత్.ధోనీ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు.
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సడెన్ గా సూసైడ్ చేసుకున్నారు సుశాంత్.అయితే తాజాగా పోస్టుమార్టం డాక్టర్ చేసిన వ్యాఖ్యలతో రెండేళ్ల తర్వాత సుశాంత్ ఆత్మహత్య కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్ ట్రెండ్ అవుతోంది.దీంతో సుశాంత్ ది హత్యా.? ఆత్మహత్య.? అనేది చర్చనీయాంశంగా మారింది.







