ఆ హీరోయిన్ జాతకాన్ని బాలయ్య మారుస్తాడా.. రెండు ఫ్లాపులు అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాస్ ఏరియాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.అఖండ మూవీతోనే బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉన్నా తక్కువ టికెట్ రేట్లు, కరోనా భయం వల్ల ఈ సినిమా 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితం అయింది.

 Will Balakrishna Change Heroine Honey Rose Fate Details, Honey Rose, Heroine Hon-TeluguStop.com

అయితే అఖండ సినిమాతో బాలయ్య మాస్ గర్జన ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది.వీరసింహారెడ్డి హక్కులు రికార్డు రేటుకు అమ్ముడవ్వడానికి ఇది కూడా ఒక కారణమే అని చెప్పవచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మొదటినుండి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ అనే విధంగా ప్రచారం చేశారు.అయితే వాస్తవం ఏమిటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.

వీరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషస్తుండగా సీనియర్ బాలయ్యకు జోడీగా హనీ రోజ్ నటిస్తున్నారు.ఈ హీరోయిన్ పేరు వినగానే కొంతమంది కొత్త హీరోయినా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే హనీ రోజ్ కు ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉన్నా తెలుగులో మాత్రం మరీ ఓ రేంజ్ గుర్తింపు లేదు.

Telugu Balakrishna, Honey Rose, Manobhavalu, Veersimha Reddy-Movie

హనీ రోజ్ చాలా సంవత్సరాల క్రితం తెలుగులో రెండు సినిమాలు చేసింది.ఈ సినిమాలలో ఈ వర్షం సాక్షిగా మూవీ ఒకటి కాగా ఆలయం మూవీ మరొకటి.ఈ రెండు సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలయ్యాయో కూడా అభిమానులకు తెలియదు.

మా బావ మనోభావాలు సాంగ్ లో అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వెయ్యడం తో ప్రస్తుతం హనీ రోజ్ పేరు మారుమ్రోగుతుంది.బాలయ్య సినిమాతో ఈ హీరోయిన్ జాతకం మారుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Balakrishna, Honey Rose, Manobhavalu, Veersimha Reddy-Movie

హనీ రోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవుతారని కొంతమంది అభిప్రాయం వ్యక్తమవుతోంది.సీనియర్ హీరోలకు జోడీలను వెతకడం ప్రస్తుతం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా ఉందన్న సంగతి తెలిసిందే.హనీ రోజ్ కు స్టార్ స్టేటస్ దక్కితే ఆమె సీనియర్ స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ ఉంది.హనీ రోజ్ పారితోషికం కూడా తక్కువే కావడం ఆమెకు మరింత ప్లస్ అవుతింది.

వీరసింహ రెడ్డి విడుదలైన తర్వాత హనీ రోజ్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube